ఏపీ ఐపీఎస్ అధికారుల బదిలీల్లో మార్పులు, అదనపు కేటాయింపులు

  • 8 మంది సీనియర్ ఐపీఎస్ ల పోస్టింగుల్లో మార్పులు
  • కొందరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
  • ఆనందరెడ్డిని ఇంటెలిజెన్స్ విభాగానికి బదిలీ చేసిన సర్కారు
ఏపీ ప్రభుత్వం ఐపీఎస్ అధికారుల బదిలీల్లో మార్పులు చేర్పులు చేసింది. తాజాగా ఎనిమిది మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల పోస్టింగ్ లు, బదిలీల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ శంఖబ్రత బాగ్చీకి అదనంగా హోంగార్డ్ ఏడీజీ బాధ్యతలు అప్పగించారు. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ రాజశేఖర్ బాబుకు కోస్టల్ సెక్యూరిటీ ఐజీగా అదనపు బాధ్యతలు కేటాయించారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్ డీసీపీగా కృష్ణకాంత్ ను నియమించారు. ఏపీ సీఐడీ ఎస్పీగా గంగాధర్ రావును నియమించారు. 

కాకినాడ ఎస్పీ సతీశ్ కుమార్ కు అదనంగా కాకినాడ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ గా బాధ్యతలు కేటాయించారు. మంగళగిరి ఆరో బెటాలియన్ కమాండెంట్ గా వి.రత్న, అనంతపురం 14వ బెటాలియన్ కమాండెంట్ గా అమిత్ బర్దార్ ను నియమించారు. 

సీనియర్ ఐపీఎస్ అధికారి ఆనందరెడ్డిని ఇంటెలిజెన్స్ విభాగానికి బదిలీ చేశారు.

Andhra Pradesh
IPS
Postings
Transfers

More Telugu News